Thursday, July 2, 2026
HomeCrimeదాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు లేనట్టేనా...!

దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు లేనట్టేనా…!

📰 Generate e-Paper Clip

చట్టం పోలీసులకు చుట్టమా..?

Post Midle

ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు..

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గత రెండు రోజుల క్రితం దళిత యువకుడు సాయి కిరణ్ ను తనకు సంబంధం లేని కేసు లో విచారణ పేరిట తీసుకెళ్ళి కానిస్టేబుల్ కనవేన సంపత్ దాడి చేసిన విషయం తెల్సిందే.. అయితే ఇదే విషయం పై దళిత యువకుడు సాయి కిరణ్ తనను కానిస్టేబుల్ కనవేన సంపత్ సంబందం లేని కేసు లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డట్లు స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్న కానిస్టేబుల్ సంపత్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలు దారి తీస్తుంది..చట్టం సామాన్యులకు ఒక విధంగా.. పోలీసులకు చట్టంగా మారిందా.. కానిస్టేబుల్ సంపత్ పై చర్యలు తీసుకోకపోవడం, ఒ కేసు నమోదు చేయకపోవడం తో చట్టం పోలీసుల కు చట్టంగా మారినట్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.. కానిస్టేబుల్ సంపత్ కు కొంతమంది పోలీస్ ఉన్నత అధికారుల తో సత్సంబంధాలు వుండడం తోనే తన అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారేమో అని పలు అనుమానాలకు తావిస్తుంది..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.