Telugu Updates
Logo
Natyam ad

ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన డాక్టర్ హరీష్ రాజ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలోని సాయి కుంటలోని బాలికల ఆశ్రమ పాఠశాలలను మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్  శనివారం సందర్శించి ఆశ్రమ పాఠశాలలో అందిస్తున్న భోజనాన్ని  పరిశీలించి భోజనం చేయడం భోజనం చేశారు.. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచి పిల్లలకు నాణ్యమైన పౌష్టికారకు సంబంధించిన ఆహార పదార్థాలను అందిస్తున్నది ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన భోజనము అందించడంలో భాగంగా వంట రూంలో  తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహార పదార్థాలను వాడడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత హాస్టల్ చుట్టూ పరిశుభ్రత ఆహార పదార్థాలు నిల్వల్లో పరిశుభ్రత మాంసానికి సంబంధించిన ఆహారం పదార్థాలు వండేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా హాస్టల్ వార్డెన్ శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. కోడిగుడ్డు కానీ ఇతర మాంసాహారాలు పిల్లలకు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వంటలు వండటం లో పరిశుభ్రమైన నీరు ఉపయోగించాలని, వంట చేసేవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిల్లలు తినేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలని అదేవిధంగా వేడివేడి ఆహార పదార్థాలు అందించాలని ముఖ్యంగా పిల్లలు అన్నం తిన్న తర్వాతనే నీటి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి గ్లాసులు దగ్గర ఉంచుకోవాలని కోరడమైనది.

పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు వంట సిబ్బందికి హాస్టల్ సిబ్బందికి అవగాహన కల్పించడం అయినది.. ఈ కార్యక్రమంలో సికిల్ సెల్ పైన పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బందిని గూర్చి తెలుసుకున్నారు టార్గెట్లను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ రాజ్ వార్డెన్ ధర్మారాణి స్పెషల్ ఆఫీసర్ జ్యోతి రేణుక లక్ష్మి మహేశ్వరి ఆరోగ్య సిబ్బంది ఈ హాస్టల్ కమిటీ శ్రీమతి లక్ష్మీ, మరియు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు