మంచిర్యాల జిల్లా: మందమర్రి పట్టణానికి చెందిన చురకలు పాత్రికేయుడికి రాష్ట్రస్థాయి ఉత్తమ గౌరవం దక్కింది. జర్నలిస్టు వృత్తి చేపట్టిన అనతికాలంలోనే సామాజిక కోణం వార్తా కథనాలు రాస్తూ మంచిర్యాల జిల్లాలో చెట్లపల్లి అనిల్ భగత్ తనదైన శైలి ముద్రవేసుకున్నాడని చెప్పకతప్పదు. ఈ అరుదైన అవార్డు లభించిన సందర్భంగా మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల సంజీవ్ భగత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదల కష్టాలను మానవీయ కోణంలో పత్రికా కథనాలగా రాస్తూ ప్రజల మన్ననలను పొందడం హర్షణీయమని అన్నారు. యువ పాత్రికేయుడు అనిల్ భగత్ “బ్రతకలేని అమ్మలకు బతుకమ్మ లేకపోయే” అని రాసిన కథనానికి పురస్కారం ప్రశంసా పత్రాలు లభించడం మందమర్రి పట్టణానికి గర్వకారణమని అన్నారు. ఆ కథనాన్ని ఆర్.ఎస్.ఎన్ సేవా ఫౌండేషన్ గుర్తించడం ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన భవన్ లో సోమవారం వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించడం అనిల్ జీవితంలో మర్చిపోని ఘటన అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎన్. సేవ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, టి.పి.ఎస్.సి సభ్యులు రవీందర్ రెడ్డి, దేవి ప్రసాద్, టి.యు.డబ్ల్యూ.జే రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ పాత్రికేయులు వెల్జాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.