హైదరాబాద్: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటుపడుతుందని.. సమాజ అభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అత్యున్నత చట్ట సభల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రయత్నిస్తే.. ప్రధాని మోదీ తొక్కి పెట్టారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేస్తామన్నారు. మహిళల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని.. వారికి జరుగుతున్న అన్యాయంపై పోరాడాలన్నారు. గల్లీల్లోనూ గంజాయి, మందుసీసాలు దొరుకుతున్నాయని.. తెలంగాణను వ్యసనపరులు రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి అందరూ కదిలిరావాలని రేవంత్ రెడ్డీ పిలుపునిచ్చారు..