Telugu Updates
Logo
Natyam ad

అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎఐసిసి టిపిసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. రాజ్యాంగ నిర్మాత డా .బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రం అందజేసిన తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, లక్షెటిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యూ
ఐ. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..