Friday, July 3, 2026
HomeTelanganaపొత్తు దిశగా.. కాంగ్రెస్, సీపీఐ చర్చలు

పొత్తు దిశగా.. కాంగ్రెస్, సీపీఐ చర్చలు

📰 Generate e-Paper Clip

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు దిశగా సీపీఐ అడుగులేస్తోంది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి స్పష్టంచేసింది.

కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్, స్థానాలను కోరిన కమ్యూనిస్ట్ పార్టీ?

రెండు అసెంబ్లీ, ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్న కాంగ్రెస్

 

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు దిశగా సీపీఐ అడుగులేస్తోంది. తాము అడిగిన అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తే ఆ పార్టీతో చేయి కలిపేందుకు సిద్ధమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి స్పష్టంచేసింది. ఏఐసీసీ పంపిన దూతతో సీపీఐ రాష్ట్ర నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి ఆదివారం దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), బెల్లంపల్లి (మంచిర్యాల), మునుగోడు (నల్గొండ), హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా) అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ ను అనధికారికంగా కోరినట్లు తెలుస్తోంది. అయితే మునుగోడు, హుస్నాబాద్ అసెంబ్లీ సీట్లను, ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. మరో అసెంబ్లీ సీటు కావాలని సీపీఐ పట్టుబట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Post Midle

• హుస్నాబాద్ కోసం కాంగ్రెస్ లో గట్టి పోటీ..

హుస్నాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గట్టిగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ ను సీపీఐకి ఇవ్వొద్దని పట్టుబడుతున్నట్లు సమాచారం. కానీ పొత్తుపై పార్టీ నిర్ణయం తీసుకుంటే సహకరించాల్సి వస్తుందని సీనియర్ నేతలు స్పష్టంచేశారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి కూడా హుస్నాబాద్ లో కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నారు.

•చర్చలు జరిపాం.. సీట్ల విషయాన్ని అడగలేదు.

– కూనంనేని సాంబశివరావు

పొత్తు దిశగా కాంగ్రెస్ పార్టీతో ఆదివారం చర్చలు జరిపిన మాట వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇవ్వాలనేది అడగలేదని తెలిపారు. మరిన్ని చర్చల తరువాత సీట్లు, పొత్తు ఖరారు కావచ్చని స్పష్టంచేశారు. జాతీయస్థాయిలో ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడానికి అవకాశాలున్నాయని కొందరు నేతలు చెప్పారు. 2018 ఎన్నికల్లో సైతం ‘మహాకూటమి’ పేరుతో కాంగ్రెస్, సీపీఐ, ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. అప్పుడు వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ ను సీపీఐకి మహాకూటమి కేటాయించింది. కొత్తగూడెం సీటును ఇస్తామని చెప్పినా చివరిక్షణంలో కాంగ్రెస్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పొత్తు చర్చల పేరుతో మూడు నెలలు జాప్యం చేసి చివరి క్షణంలో సీట్లు ఖరారుచేశారని, దీనివల్ల ప్రచారానికి తగిన సమయం లేక నష్టపోయామని సీపీఐ నేతలు కాంగ్రెస్ దూతకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పొత్తు కుదుర్చుకునే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పొత్తు కుదుర్చుకునే పక్షంలో ఈసారి జాప్యం చేయకుండా ఒకటి, రెండు దఫాల చర్చల్లోనే సీట్లను ప్రకటించాలని గట్టిగా కోరినట్లు సమాచారం. సీపీఎం కూడా పొత్తుకు ముందుకు రావచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.