
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ మండలంలోని కోసిని గ్రామం బేస్ క్యాంప్ కు సమీపంలోని అటవి ప్రాంతంలో మేతకు వెళ్ళిన పశువుల మందపై గురువారం సాయంత్రం పెద్దపులి అకస్మాత్తుగా దాడి చేసింది. మందపైకు దూకిన పెద్దపులి ఆవుదూడ మీదకు ఎక్కి తీవ్రంగా గాయపరుస్తుండగా వాటి అరుపులకు అక్కడే ఉన్న పశువుల కాపర్లు గట్టిగా అరవడంతో పెద్దపులి దూడను వదిలి అడవిలోకి పారిపోయింది. తీవ్ర గాయాలతో గ్రామానికి చేరిన ఆవుదూడ కోసిని గ్రామానికి చెందిన గుర్లె మొండికి చెందినదిగా గుర్తించారు గత పదిహేను రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పెద్దపులి ఆవుల మందపై దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. మళ్లీ ఈరోజు పులి దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.

