Friday, July 3, 2026
HomeTelanganaఆదివాసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్ లో ప్రారంభించనున్న ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవానికి తరలివెళుతున్న షెడ్యూల్డ్ తెగల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డిసీపీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి కార్యక్రమ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

ఈ నెల 17న హైదరాబాద్ లో  ఆదివాసీ గిరిజన సమ్మేళనంలో కొమరంభీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ ప్రారంభోత్సవం జరుగనున్నందున జిల్లా నుండి షెడ్యూల్డ్ తెగల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తరలివెళ్ళేందుకు రవాణా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.