Thursday, July 2, 2026
HomeTelanganaఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేయాలి.?

ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేయాలి.?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Post Midle

మంచిర్యాల జిల్లా: తెలంగాణ సిద్ధాంకర్త ప్రొ॥ జయశంకర్ సార్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం 88వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రొ॥ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, 1969 నుండి నీళ్లు, నిధులు, నియామకాలు బంగారు తెలంగాణతోనే సాధ్యమని ఉ ద్యమానికి రూపకల్పన చేశారని అన్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తితో స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, నకల జనుల అభ్యున్నతిని సాధిస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.