Telugu Updates
Logo
Natyam ad

వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు..?

మహబూబాబాద్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. దాదాపు 3గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు మత్తడి పోశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. నెల్లికుదురులో 14.8 సెం.మీ వర్షం కురిసింది. తొర్రూరులోని ఆర్యభట్ట ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు నర్సింహులపేటకు వస్తుండగా మార్గ మధ్యంలో వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు.

బస్సులో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. నర్సింహులపేట మండల కేంద్రంలో భారీ వర్షానికి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణ మొత్తం వరద నీటితో నిండిపోయింది. నెల్లికుదురు మండల కేంద్రం నుంచి రావిరాల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి..