
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనమా భూములపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఈ భూముల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం అమ్మినవారి సంతకం, అఫిడవిట్ అవసరం లేకుండా నిబంధనలను తొలగించనుంది. దీంతో 9 లక్షల దరఖాస్తులు పరిష్కారం కానున్నాయి. భూమి అమ్మిన వ్యక్తి సంతకం అవసరం లేకుండా, పొషెషన్ విధానంలో ప్రభుత్వం భూమిని నిర్ధారించనుంది. ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది పొలాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేసి, భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు. ఎప్పటినుంచి సాగు చేస్తున్నారు అనే విషయాలను ధృవీకరించనున్నారు.

