Monday, August 17, 2026
HomeTelanganaశ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులతో నిండిపోయింది. బసవన్నల ఊరేగింపు, గాలిపటాలు ఎగురవేయడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం, రైతుల శ్రమను గుర్తుచేసేలా నాట్లు వేయడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంజీవ్ మాట్లాడుతూ.. రైతులు పంట చేతికి వచ్చాక చేసే మొదటి పండుగ సంక్రాంతి అని, మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు. అందరూ భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఏజిఎం అరవింద రెడ్డి ఆకాంక్షించారు. పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్లు, పిఇటి రాజేందర్, ఏఓ విలాస్, పిఇటి కుమార్, అక్షయ్ కుమార్, రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.