Monday, August 17, 2026
HomeTelanganaరెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

📰 Generate e-Paper Clip

నూతన జిల్లా అధ్యక్షుడు గా శ్రీనివాస్ రావు దేశ్ పాండే

మంచిర్యాల జిల్లా ట్రెసా నూతన కార్యవర్గం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: 2025-28 సంవత్సరాలకు గాను ట్రెసా మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం సాయంత్రం మంచిర్యాల లోని ట్రెసా భవనంలో ఎన్నికల అధికారి పడిగేల రాజ్ కుమార్, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుల అధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సమావేశంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు కలిసి శ్రీనివాస్ రావు దేశ్ పాండే ను నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా తమ మీద నమ్మకంతో ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరికి ట్రెసా నూతన కార్యవర్గం కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి ట్రెసా జిల్లా సంఘం కృషి చేస్తుందని అలాగే రైతులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ శాఖకు పూర్వవైభవాన్ని తీసుకురావడంపై ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అలాగే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్ నిర్మించడానికి ట్రెసా జిల్లా సంఘంతో కృషి చేస్తామని అన్నారు.. ఈ ఎన్నికలలో సహాయ ఎన్నికల అధికారులుగా జగిత్యాల జిల్లా ట్రెసా అధ్యక్షులు వకీల్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ వ్యవహరించారని తెలిపారు..

• ట్రెసా నూతన కార్యవర్గం సభ్యులు:

జిల్లా అధ్యక్షుడు గా శ్రీనివాస్ రావు దేశ్ పాండే, కార్యదర్శిగా వి.వి.ఆర్.కె. డి. ప్రసాద్
అసోసియేట్ అధ్యక్షులుగా బి. సంతోష్
ఉపాధ్యక్షులుగా జె. అశోక్, ఎస్.కె. హమీద్, జి.హరిత, టి. రాఘవేంద్ర రావు, కోశాధికారిగా ఎన్. సతీశ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి.రంజిత్ కుమార్, ఎజాజుద్దీన్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.రవికిశోర్, ఏ.స్వప్న, డి.రజిత, బి. పద్మజ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా ఏ. నవీత్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎం. ప్రశాంత్ కుమార్, ఎం.శిరీష, ఈ. పద్మశ్రీ, ఎస్.జనార్దన్, ఎం.శ్రీనివాస్, సి.హెచ్. మహేష్ లను ఎన్నుకున్నారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇత్యాల కిషన్, కృష్ణ, తహశీల్దార్లు హన్మంతరావు, సతీష్ కుమార్, దిలీప్ కుమార్, వనజా రెడ్డి, సంతోష్, రాజమనోహర్ రెడ్డి, జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.