Monday, August 17, 2026
HomeCrimeహత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను అరెస్టు చేయాలి

హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

రెబ్బన ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: న్యాయవాదిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను వెంటనే అరెస్టు చేసి రెబ్బెన ఎస్సై పైన శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కాగజ్నగర్ డిఎస్పి రామానుజమ్ కు ఆసిఫాబాద్ ,కాగజ్నగర్ బారాసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు .ఈనెల 6న నంబాల గ్రామానికి చెందిన రత్నం ఆనంద్ రావ్, అతని అనుచరులు కలిసి రెబ్బన మండలం నంబాల గ్రామానికి చెందిన న్యాయవాది పూదరి నరహరి, అతని అన్న వారి చేనుకు వెళ్లి పని నిమిత్తం రెబ్బెన మండల కేంద్రానికి వెళుతుండగా రోడ్డుపై బొలెరో , ఆటో బైకులు రోడ్డు అడ్డంపెట్టి న్యాయవాది నరహరిని అతని అన్నపై మరణయుధాలతో (గొడ్డలి, కర్రలు) కారంపొడి వారి కళ్ళలో చల్లి వారిపై దౌర్జన్యంగా దాడి చేసి చరవాణి బలవంతంగా లాక్కోవడం జరిగిందన్నారు.అనంతరం నానాబూతులు తిట్టుతూ మిమ్మల్ని చంపేస్తాం, మాదే ప్రభుత్వం ఉంది, మాకు సంబంధించిన పోలీసులే ఉన్నారు. మీపై తప్పుడు సాక్షాలు కల్పించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తాం అంటూ బెదిరించడం జరిగిందన్నారు. అనంతరం రెబ్బెన పోలీస్ స్టేషన్ కు న్యాయవాది వెళ్లి ఫిర్యాదు చేయగా సదరు ఎస్సై న్యాయవాది నరహరిని సీసీ కెమెరాలు లేని రూంలోకి తీసుకెళ్లి నీ హైకోర్టు ఆర్డర్ ఇక్కడేమి పనికిరాదు అని హైకోర్టు ఆర్డర్ ని చింపేశారన్నారు. ఎస్సై ఎదుటివారిని పిలిచి పోలీస్ స్టేషన్ ప్రైవేట్ రైటర్ తో తప్పుడు కేసునుసృష్టించి నీకేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని దాడి చేసిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిఎస్పి కి ఫిర్యాదు చేశారు.

న్యాయవాదికి న్యాయం జరగని పక్షంలో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల నిరవధిక సమ్మెను ప్రకటిస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి సురేష్, ఎం సురేష్, బోనగిరి సతీష్ బాబు,వి కిషోర్ కుమార్, రాపర్తి రవీందర్, చంద్రకుమార్, శ్రీనివాస్, నికోడే రవీందర్, రామకృష్ణ, జి గణపతి, జై శ్యాం కుమార్, జీవీఎస్ ప్రసాద్, విద్యాసాగర్, రాజీవ్ రెడ్డి,ఎం చరణ్ తేజ, గంట కళ్యాణ్, ఎల్ నాగేష్, రాజ్ కుమార్, ఇగురపు సంజీవ్, వాట్సాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.