
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎ.సి.సి. కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ( సిబిఎస్ఇ మరియు స్టేట్ ) లో బుధవారం కార్మెల్ డే వేడుకలు ఆత్మీయ వాతావరణంలో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణను విద్యార్థులు శుభ్రంగా అలంకరించి, ప్రత్యేక ప్రార్థన సమయం ఏర్పాటు చేశారు. భక్తిగీతాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కార్మెల్ తల్లి సేవా దృక్పథం, త్యాగ మార్గాన్ని వివరిస్తూ ప్రసంగాలు చేశారు. విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాదర్ డానియల్ హాజరై అనంతరం కాన్వెంట్ ప్రిన్సిపల్ సిస్టర్స్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ..

ప్రతి సంవత్సరం జూలై 16న నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కార్మెల్ తల్లి ఆరాధనకు అంకితం చేస్తారు.. కార్మెల్ తల్లి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. త్యాగం, ప్రేమ, సేవా భావం వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా, తమ సంప్రదాయాలను గుర్తు చేసేలా జరిగాయి అని తెలిపారు..

అనంతరం సీబీఎస్ఇ ప్రిన్సిపల్ సిస్టర్ రినేట్, మరియు స్టేట్ ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీబీఎసఇ మరియు స్టేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..

