జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నికలలో భాగంగా ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరుగనున్న పోలింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారం, పరిశ్రమలు, ట్రేడ్ ఇతర సంస్థలలో పని చేస్తున్న అర్హత గల ఓటర్లు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు పోలింగ్ జరుగుతుందని, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు, అధికారులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా విధులలో వెసలుబాటు కల్పించడం జరుగుతుందని సెలవు దినం ఇవ్వడం జరుగుతుందని, ఆయా సంస్థల యాజమాన్యాలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సహకరించాలని తెలిపారు.
