Friday, July 3, 2026
HomeCrime28 లక్షల రూపాయలు దొంగిలించిన నిందితుల అరెస్ట్.

28 లక్షల రూపాయలు దొంగిలించిన నిందితుల అరెస్ట్.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో సంచలనం రేపిన పార్కింగ్ కారు నుంచి రూ. 28 లక్షలు దొంగిలించిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రామగుండం సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారుడు బిపిన్ కుమార్ వద్ద కారు డ్రైవర్ గా పనిచేసే పటాలవత్ దాసు అతని స్నేహితులు జోగు, ముప్పూరి రాజు, పండుగ రాజులను బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య అధ్వర్యంలో నిందితులను పట్టుకోవడం కోసం నాలుగు ప్ర్యతేక మైన పోలీస్ టీం లను ఏర్పాటు చేసి నిందితులు ప్రయాణించిన మార్గాలలోని సిసి టివి పుటేజ్ లను పరిశిలించి వాటి ఆధారంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి అట్టి  కేసు లో నలుగురు నేరస్తులను బెల్లంపల్లి ప్రభుత్వ కళాశాల సమీపంలో పట్టుకొని నలుగురి వద్ద నుండి చోరి సొత్తు-24 లక్షల రూపాయలు, 2, బైకులు, 4-సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కానిస్టేబుల్ ఐ.మల్లేశం, మంచిర్యాల సిసిఎస్ కానిస్టేబుల్స్ సతీష్, శ్రీనివాస్ ను సిపి క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు.

Post Midle

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.