Wednesday, August 19, 2026
HomeTelanganaనీ ఒక్క ఓటుతో గెలిచానా.?

నీ ఒక్క ఓటుతో గెలిచానా.?

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే, కార్యకర్త సంభాషణ ఆడియా వైరల్

ఆంజనేయులు న్యూస్, బైంసా: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమైన ఓ ఆడియో సంభాషణ చర్చకు దారితీసింది. 1.25 నిమిషాల ఆడియో రికార్డులో ఓ కార్యకర్త మాట్లాడుతూ. ఎన్నికల్లో జెండా మోశాం. మీకు ఓటేశాం.. ఓట్లు వేయించాం.. మీరు మాకు ప్రాధాన్యమివ్వడం లేదనే సారాంశంతో ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బదులుగా ఎమ్మెల్యే పి.రామారావుపటేల్ నీ ఒక్క ఓటుతోనే గెలువలేదు. నీ గరుజు (అవసరం) కోసం ఓటేశావు. నీ ఒక్క ఓటుతో నన్ను కొనుక్కున్నావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉన్న ఆడియో వైరల్ అయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లగా, దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై వివరాలు సేకరించాక స్పందిస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.