Tuesday, August 18, 2026
HomeTelanganaఎన్నికల డ్యూటీపై వెళుతున్న హోంగార్డ్ అధికారులకు సీపీ దిశనిర్దేశం

ఎన్నికల డ్యూటీపై వెళుతున్న హోంగార్డ్ అధికారులకు సీపీ దిశనిర్దేశం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో శనివారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. (ఐజి) రామగుండం పోలీస్ కమీషనరేట్ నుండి తమిళనాడు సాధారణ ఎన్నికలు 19-04-2024 రోజు సందర్బంగా డ్యూటీపై వెళ్తున్న 64 మంది హోంగార్డ్ ఆఫీసర్స్ కి  ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల రోజున విధులు అందరు తప్పని సరిగా పాటించవలసిన నిబంధనలు గురించి దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలి, ఏలాంటి చెడు అలవాట్లు ఉన్న మనివేసుకోవాలని, అప్పగించిన విధులు నిబద్దతతో పూర్తి చేసి తెలంగాణ పోలీస్, రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ కు మంచి పేరు తీసుకురావాలి సిబ్బంది కి సూచించారు.విలువైన ఆభరణాలు, వస్తువులు వెంట తీసుకువెళ్ళకూడదు అని సూచించారు. మీరు అక్కడ విధుల్లో ఉన్నప్పుడు ఇంటి వద్ద కాని కుటుంబ సభ్యలకు గాని ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే ఇక్కడ ఉన్న అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తారు మీకు కుటుంబలకు అండగా ఉంటాం అని సిబ్బంది కి సీపీ భరోసా అందించారు. సముద్ర తీరం మరియు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే ప్రదేశము కావున తప్పని సరిగా ఎల్లపుడు నీరు ఎక్కువగా తీసుకోవాలి అని సూచించారు. 3 జతల యూనిఫాం తీసుకెళ్లాలి. ముఖ్యమైన మెడిసిన్ తీసుకెళ్లండి. మీకు డ్యూటీ పాస్ పోర్ట్ ద్వారా ఇవ్వబడిన  డ్యూటీ ప్రాంతనికి ముందు రోజే ఎన్నికల బూతు ఉన్న ప్రాంతానికి చేరుకొవాలి. ఆ ప్రాంతం వాతావరణాన్ని ముందుగానే గమనించి అసాంఘిక సంఘటనలు జరిగే సూచనలు ఉన్నచో అధికారులకు ముందుగానే తెలియజేయాలి. డ్యూటీ స్థలాన్ని అత్యవసరమైన పరిస్థితులో అయినా సంబందించిన అధికారులకు చెప్పకుండా వదిలి వెళ్ళకూడదు. డ్యూటీకి నీట  యూనిఫామ్ లో సరైన సమయంలో రిపోర్ట్ చేయాలి. అందరితో మర్యాదగా ప్రవర్తించాలి.మీ దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్, ఫైర్ స్టేషన్ లోని సీనియర్ ఆఫీసర్ల ఫోన్ నంబర్లు కలిగి ఉండాలి. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ ఉన్నది తెలుసుకొని ఉండాలి వారితో సమాచార సంబంధాలను కలిగివుండాలి. బందోబస్త్ లోని ఒక విభాగం మొబైల్ పార్టీగా నిర్దేశించబడి ఉంటుంది, వారు తమకు ఇవ్వబడిన పరిధిలో పెట్రోలింగ్ చేస్తూ అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. డ్యూటీ కి వెళ్తున్న సిబ్బంది కి అత్యవసరమైన మెడిసన్ కిట్స్, మాస్కిటో నెట్స్, కాయిల్స్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో అడిషనల్ డిసిపి అడ్మిన్  సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఎఆర్ ఎసిపిలు ప్రతాప్,సురేంద్ర ఆర్ఐ హోం గార్డ్స్ మలేశం , ఆర్ఎస్ఐ, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.