మంచిర్యాల జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎం.వి.గుణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుందరశాల గ్రామాన్ని సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలో భాగంగా కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బిఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వి. గుణ స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది 2016 మే నెలలో, అదే సంవత్సరం నవంబర్ లో వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. 2019 ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆయన అదే పదవిలో కొనసాగి, ఎంపీ టికెట్ రానందున టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకి వచ్చారు. జూన్ 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. అంటే దాదాపు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వివేక్ వెంకటస్వామి ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి కేసీఆర్,బాల్క సుమన్, హరీష్ రావు తదితరులతో పాటు వివేక్ పై కూడా యాక్షన్ తీసుకోవాలి. కేవలం కండువా మార్చినంత మాత్రాన కుట్రలో భాగస్వామ్యం లేకుండా పోదు. వివేక్ వెంకటస్వామి తో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలో భాగమే అని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

