
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామ ఎస్సి కాలనీ కి చెందిన కీ”శే” కంబాల మల్లేష్ కూతురు కంబాల శైలజ ఇంటర్మీడియట్ లో 931 మార్కులతో రాణించి కెఎన్ఆర్ఎస్ మంచిర్యాల కాలేజ్ లో బిఎస్సీ నర్సింగ్ సీట్ సాధించింది. తను నిరుపేద కుటుంబం చదువుల కొరకు ఆర్థిక స్తోమత లేనందున ఆమె స్థానికుల ద్వారా “మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్” మంచిర్యాల వారిని సంప్రదించి పై చదువులు కొనసాగిస్తానని మీ వంతు సహాయం కావాలని చెప్పడంతో వెంటనే స్పందించిన మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల వారు ముందుకు వచ్చి తమ సంస్థ తరుపున చిరు సహాయంగా రూ.10,000/- (పది వేల) చెక్కు ద్వార సోమవారం ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం మునుపు ఎన్నో కార్యక్రమాలు చేసాము మరియు ఇంకా దాతలు ఎవరు అయిన ముందుకు వచ్చి ఆ విద్యార్థినిని ప్రోత్సహించాలని మా సంస్థ ద్వార కోరుతున్నాము. చేసే సహాయం చిన్నదే కావచ్చు కాని మంచి చేయాలన్న సంకల్పం చాల గొప్పది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భూమేష్, ఉపాధ్యక్షుడు కుమార్, ట్రస్ట్ సభ్యులు సంపత్, సరేశ్, శ్రీనివాస్ మల్లేష్ లు పాల్గొన్నారు.

