Wednesday, August 19, 2026
HomeCrimeరిమ్స్ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

రిమ్స్ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అర్ధరాత్రి బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఇద్దరికి గాయాలైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఓ వైద్యుడితో పాటు వచ్చి తమపై దాడి చేశారన్నారు. ఈ దాడిని ఖండిస్తూ విధులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు. గురువారం కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి నిరసన తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మరో వైద్యుడు క్రాంతి కుమార్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గాయపడ్డ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు పోలీసులు క్యాంపస్ కు చేరుకొని దీనిపై ఆరా తీశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీగా మోహరించారు. కళాశాల ఆవరణలోకి వచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.