Monday, August 17, 2026
HomeCrimeగుర్తు తెలియని శవం లభ్యం

గుర్తు తెలియని శవం లభ్యం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మందమర్రి మండలం ఊరు మందమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం, అంబేద్కర్ విగ్రహం సమీపంలో నలుపు పూల చొక్కా ధరించిన సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించాడనీ తెలిపారు. స్థానికులు పోలీసులకు తెలుపడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని వేషధారణను బట్టి యాచకుడిగా ఆకలికి తాళలేక, చలి తీవ్రతతో అనారోగ్యంతో మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.