Thursday, July 2, 2026
HomeTelanganaప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఖాయం

ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఖాయం

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం హైటెక్ సిటీ నందు మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో కాంగ్రెస్ మంచిర్యాల పట్టణ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో నీతికి నిజాయితీకి ప్రజలు పట్టం కట్టారని తద్వారా మంచి నాయకుడిని ప్రజలు ఎంతో విశ్వాసంతో గెలిపించుకున్నారని కొనియాడారు గత 40సం॥రాల నుండి రాజకీయాలలో ఎనలేని సేవలను అందిస్తున్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎన్నో సేవా కార్యక్రమాలు పదవిని ఆశించకుండా చేయడం జరిగిందని తెలిపారు అలాంటి నాయకుడికి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనునిత్యం ప్రజలకు సేవకుడిగా ఉండే ప్రేమ సాగర్ రావు మామూలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజలకు ఎంతో చేశాడని అలాంటి ఆశయాలు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే మంచిర్యాల నియోజకవర్గం అత్యున్నత శిఖరాలకు అభివృద్ధి స్థాయిని తీసుకెళ్తాడని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేమసాగర్ రావు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తోందని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంను తప్పకుండా అభివృద్ధి చేస్తారని తెలిపారు.అన్ని మండలాల్లో ప్రేమ్ సాగర్ రావుకు అత్యధికంగా మెజార్టీ కట్టపెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.