Thursday, July 2, 2026
HomeTelanganaకాంగ్రెస్ లో చేరిన శేజల్

కాంగ్రెస్ లో చేరిన శేజల్

📰 Generate e-Paper Clip

శేజల్ కు కండువా కప్పుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జి. వినోద్

Post Midle

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అరిజన్ డెయిరీ సీఈఓ శేజల్ గురువారం మాజీ మంత్రి గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరుకున్న ఆమె వినోద్ తో పాటు ఇతర నాయకులను కలిశారు. శేజల్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం ఆగదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరిజన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణపై పోలీసులతో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం తమ వైపు ఉండడంతో బోర్డు మీటింగ్ పీడీ యాక్టు రద్దు చేశారన్నారు. అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించడం చిన్నయ్యకు అలవాటుగా మారిందని ఆరోపించారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.