Tuesday, August 18, 2026
HomeTelanganaక్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి వివరాలతో సిద్ధంగా ఉండాలి.

క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి వివరాలతో సిద్ధంగా ఉండాలి.

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్వచ్ట్ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాల పరిశీలించేందుకు కేంద్ర కమిటీ సభ్యులు జిల్లాకు రావడం జరిగిందని, గ్రామాలలోని క్షేత్ర స్థాయి సిబ్బంది వారి పరిధిలో చేపట్టిన కార్యక్రమాల పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శుక్రవారం కేంద్ర కమిటీ సభ్యులు జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 310 గ్రామపంచాయతీలలో చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర కమిటీ సభ్యులు పర్యవేక్షించడం జరుగుతుందని, ఈ క్రమంలో శుక్రవారం భీమారం మండలంలోని పోలంపల్లి, ఖాజీపల్లి, బెల్లంపల్లి మండలంలోని బూదకలాన్, పెర్కపల్లి గ్రామపంచాయతీలను సందర్శించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని గ్రామాల క్షేత్రస్థాయి సిబ్బంది వారి కార్యాచరణను పూర్తి చేసుకుని అన్ని వివరాలతో సిద్దంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్రావు, బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి ఎ. ఫణిందర్, మండల పంచాయతీ అధికారులు, ఎస్.బి.ఎం., జిల్లా కో-ఆర్డినేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.