
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్.సీ.ఐ ఫంక్షన్ హాల్ లో వైద్యారోగ్య దినోత్సవం మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భధావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీ నందిని నృత్యాలయం గురువు అన్నం కల్పన ఎంఏ కూచిపూడి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అలోఖి, సాధిక, రిషితా, సమన్విత, చరణి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు జ్ఞాపకను అందజేసి ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్. సుబ్బారాయుడు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్, మరియు వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శన చేస్తున్న శ్రీ నందిని నృత్యాలయం శిష్యులు

