Tuesday, August 18, 2026
HomeTelanganaక్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు

క్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రజలకు క్షేత్రస్థాయి సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వం సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్లో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి. రాహుల్తో తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తరువాత ప్రజలకు క్షేత్రస్థాయిలో సుపరిపాలన అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఏకం చేస్తూ సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వం తరుపున సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే చోట కేంద్రీకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిందని, మొదటి, రెండవ అంతస్తులలో పనులను త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని, హెలిప్యాడ్, ప్రహరీగోడ, ప్లాంటేషన్, అంతర్గత రహదారులు ఇతర అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఒకే చోట అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల చిరకాల కోరిక అయిన మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా. వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని, అనంతరం వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో కాళేశ్వరం నుండి 1 లక్ష ఎకరాలకు నీరు అందించే 1 వేయి 658 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన చెన్నూర్ ఎత్తిపోతల పథకం, మందమర్రి పట్టణం సమీపంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు భూమి పూజ చేస్తారని, గోదావరి నదిలో అంతర్గాం నుండి మంచిర్యాల వరకు నిర్మించబోయే వంతెన పనులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారని తెలిపారు. 1 లక్ష మందికి పైగా జిల్లా ప్రజలతో ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికి బహిరంగ సభ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి పర్యటించే తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. ఉద్యమ నాయకుడిగా ఎంతో అనుభవం వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని, సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమాభివృద్ధి కొరకు అహర్నిశలు పాటు పడుతుందని తెలిపారు. ఈ నెల చివరి వారంలో కాని, జూన్ నెల మొదటి వారంలో కాని జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని, ప్రజలందరు కలిసికట్టుగా ముందుకు రావాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి వారి వద్ద నుండి వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్స్ యజమానులు, అధికారులు సమన్వయంతో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని, ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలతో సర్దుబాటు చేసుకుంటున్నామని, ఇప్పటికే దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్నాన్ని కరీంనగర్ జిల్లాకు ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా పంట దిగుబడి రావడం జరిగిందని, ప్రభుత్వం కొనుగోలు చేయడంలో రైతులు సహకరించాలని, ఏదైనా సమస్య తలెత్తినట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జూన్ 2 నుండి 23వ తేదీ వరకు రెండు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 9 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి, గొప్ప అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకు తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలలో కుల, మత, పార్టీలకు అతీతంగా మమేకమై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వేడుకలు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించడం జరుగుతుందని, చదువుల పండుగ, వ్యవసాయ పండుగ, మహిళా దినోత్సవం లాంటి అనేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అభివృద్ధి వేగవంతం అయిందని, మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు అయిందని, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరధ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని. రైతుల కోసం రైతుబంధు, రైతుభీమా అమలు చేయడం జరుగుతుందని, వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పథకం ద్వారా పెన్షన్ అందించడం జరుగుతుందని, తెలంగాణ ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాల ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని, గర్భిణుల ఆరోగ్యం కోసం కె.సి.ఆర్. కిట్ అందించడం జరుగుతుందని, ఇలాంటి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో విజయవంతం చేసే విధంగా అందరు కలిసి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.