Tuesday, August 18, 2026
HomeTelangana28 ఏళ్లుగా ఇప్పటికి నిరుపయోగం

28 ఏళ్లుగా ఇప్పటికి నిరుపయోగం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా వాంకిడి మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 28సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఈ బస్టాండ్లో బస్సులు రాకపోవడం, ప్రయాణికులు లేకపోవడంతో యాచకులకు నిలయంగా తయారైంది. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కన బస్టాప్ వద్ద బస్సులు నిలుపుతుండడంతో వేసవికాలంలో, వర్షాకాలంలో హోటళ్లు, షెడ్లు, కిరాణా దుకాణాలు, చెట్ల కింద ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బస్సులకోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు తక్షణమే బస్టాండ్ను ఉపయోగంలోకి తీసుకువ చ్చి ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలి అని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.