Tuesday, August 18, 2026
HomeTelanganaమానవత్వం చాటుకున్న ఎఎస్ఐ లు

మానవత్వం చాటుకున్న ఎఎస్ఐ లు

📰 Generate e-Paper Clip

ఏఎస్ఐ వెంకటరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం మానవత్వం చాటుకున్న 1989 బ్యాచ్ ఎఎస్ఐ లు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామకృష్ణపూర్ పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న 1989 బ్యాచ్ కు చెందిన ఏఎస్ఐ మూల వెంకటరెడ్డి 2021 జనవరి 9న అనారోగ్యంతో మృతి చెందారు. ఏఎస్ఐలంతా తమ బ్యాచ్ మేట్ కుటుంబానికి బాసటగా నిలవాలని భావించారు. సహ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తామున్నామని భరోసానిచ్చారు. వారి కుటుంబానికి  ఆర్థిక సాయం చేయడానికి 1989 బ్యాచ్ ఏఎస్ఐ లు లక్ష రుాపాయలను జమ చేశారు. మంచిర్యాల డీసీపీ కార్యాలంలో శుక్రవారం డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కెకన్ ఐపీఎస్ చేతుల మీదుగా వెంకటరెడ్డి భార్య మూల శ్రీకళ కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ ఏఎస్ఐ మజీద్.. ట్రాపిక్ ఏఎస్ఐ నందయ్య.. రిటైర్డ్ ఏఎస్ఐ వీరస్వామి పాల్గొన్నారు. తాండూరు ఏఎస్ఐ లక్షణ్. బెల్లంపల్లి ఏ ఎస్ ఐ తిరుపతి.. నిర్మల్ ఏఎస్ఐ లు శ్రీనివాస్. పండరి. కాగజ్‌నగర్‌ ఏఎస్ఐ వర్మ.. అదిలాబాద్ ఏఎస్ఐ లు సుభాష్.. జహీరుద్దీన్.. మంచిర్యాల  మహిళా పిఎస్ ఏ ఎస్ఐ రాజేష్ లు వితరన చేసిన వారిలో ఉన్నారు… సాటి ఏఎస్ఐ కుటుంబానికి అర్థిక సాయం చేసి ఉదారత చాటుకున్న ఏఎస్ఐ లను డీసీపీ అభినందించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.