Wednesday, August 19, 2026
HomeTelanganaవరకట్న వేధింపులకు వివాహిత బలి

వరకట్న వేధింపులకు వివాహిత బలి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలోని ఓ పోలీసు కుటుంబంలోనే వరకట్న వేధింపులకు ఓ వివాహిత పెళ్లయిన ఏడాదికే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక 20 ఏళ్లు బండారి ఐశ్వర్యా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నార్నూర్ మండలంలోని సుంగపూర్ గ్రామానికి ఐశ్వర్య ను 10 లక్షల కట్నం ఇచ్చి యాపాల్ గూడ పోలీస్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బండారి మహేష్ కి ఇచ్చి గత సంవత్సరం ఫిబ్రవరి 3న వివాహం చేశారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుండి 22 లక్షల అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధింపులకు గురి చేశారు. దీంతో జీతంపై విరక్తిచెంది ఐశ్వర్య సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా మృతురాలికి 20 రోజుల కుమారుడు ఉన్నారు. ఐతే మృతురాలి భర్త మహేష్ తండ్రి రామారావు నిర్మల్ లో ఏ. ఆర్ ఏఎస్ఐ గా పనిచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.