Thursday, August 20, 2026
HomeTelanganaశభాష్ మంచిర్యాల పోలీస్

శభాష్ మంచిర్యాల పోలీస్

📰 Generate e-Paper Clip

పోగొట్టుకున్న మొబైల్ ను బాధితునికి అప్పగించిన మంచిర్యాల బ్లూకోల్ట్స్, పోలీసులు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పోయిన మొబైల్ ఫోన్ ను మంచిర్యాల బ్లూకోల్ట్స్ పోలీసులు కనుగొని బాధితునికి అప్పగించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. జిల్లా కేంద్రంలోని మహీంద్రా ట్రాక్టర్ షోరూంలో సాధు అనే వ్యక్తికి చెందిన రూ. 27 వేలు విలువ చేసే మొబైల్ పోయింది. వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ పోలీసులు గంగాధరి. సత్యనారాయణ, రవి, చేరుకుని పోయిన మొబైల్ తీరును పరిశీలించి సిఐ రాజు సహాయంతో లొకేషన్ ద్వారా మొబైల్ వెతికి బాధితునికి తిరిగి అప్పగించారు.. పోయింది అనుకున్న మొబైల్ తిరిగి ఇచ్చినందుకు బాధితుడు ఆనందం వ్యక్తం చేసి మంచిర్యాల పోలీస్ లకి అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.