Friday, July 3, 2026
HomeTelanganaనోట్ల గుట్టలు దొరికిన ఎమ్మెల్యే సంగతేంటి.? మోదీకి కేజ్రీవాల్ ప్రశ్న

నోట్ల గుట్టలు దొరికిన ఎమ్మెల్యే సంగతేంటి.? మోదీకి కేజ్రీవాల్ ప్రశ్న

📰 Generate e-Paper Clip

కర్ణాటక భాజపా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో అరవింద్ కేజ్రివాల్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Post Midle

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న దిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూటి ప్రశ్న వేశారు. కర్ణాటక లో భాజపా ఎమ్మెల్యే కుమారుడి ‘లంచావతారం’ ఘటనను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమీ లేని సిసోదియాపై అన్ని కేసులు పెట్టినప్పుడు.. నోట్ల గుట్టలు దొరికిన భాజపా ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదేం? అని ప్రశ్నించారు. “ప్రధానమంత్రి మోధీ జీ.. మనీశ్ సిసోదియా నివాసంలో సోదాలు జరిపినప్పుడు అధికారులకు ఏం లభించలేదు. అయినా సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోని అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆయనను అరెస్టు చేశారు. అదే మీ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తే పెద్ద మొత్తంలో నగదు బయటపడింది. అయినా ఆయనను ఎందుకు అరెస్ట చేయలేదు? ఇంకెప్పుడూ అవినీతిపై పోరాటం గురించి మాట్లాడకండి. ఆ మాటలు మీకు సరిపోవు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కర్ణాటకలోని చెన్నగిరి ఎమ్మెల్యే, భాజపా నేత మాడాళ్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాడాళ్ ఇటీవల రూ.40లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టగా.. రూ.8కోట్లకు పైగా అక్రమ నగదు బయటపడింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే వివక్షపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.