Friday, July 3, 2026
HomeTelanganaఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాలోని జైపూర్ మండలం వేలాలలో నిర్వహిస్తున్న జాతరలో డి.సి.పి. కేకన్ సుధీర్ రామ్ నాథ్, జైపూర్ ఏ.సి.పి. నరేందర్, తాసిల్దార్ మోహన్ రెడ్డితో కలిసి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. త్రాగునీరు, టెంట్లు, ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి వరుస పద్ధతిలో అనుమతించడం జరిగిందని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించడంతో పాటు అత్యవసర సేవల కొరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ కొరకు సిబ్బందిని నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం తహసిల్దార్ మోహన్ రెడ్డి తో కలిసి సుందిళ్ల పార్వతి బ్యారేజ్ ను సందర్శించారు. బ్యారేజ్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం, ఇతర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ బ్యారేజ్ నిర్వహణలో ఎలాంటి అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గుత్తేదారు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.