మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని చెప్పాల్సిన గురువులే… వాటిని పిల్లలకు నూరిపోస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లొనీ మహోబా జిల్లా కన్య ప్రాథమిక పాఠశాల ఇందుకు వేదికగా మారింది.
ఆంజనేయులు న్యూస్: మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని చెప్పాల్సిన గురువులే.. వాటిని పిల్లలకు నూరిపోస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా కన్య ప్రాథమిక పాఠశాల ఇందుకు వేదికగా మారింది. విద్యార్థినులు స్కూల్లో సోమవారం మధ్యాహ్న భోజనం తిన్నాక 15 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం.. బాలికలకు ఆత్మలు ఆవహించాయని స్కూలు యాజమాన్యం మాంత్రికుడిని పిలిపించింది. పిల్లల ఆరోగ్యం పాడవటానికి పాఠశాలలో ఉన్న దెయ్యమే కారణమని ‘ఉపశమనం’ చేయించారు. బాలికల వయసు 9 – 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా సబ్ డివిజనల్ కలెక్టర్ అరుణ్ దీక్షిత్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్లు వెల్లడించారు.

