Thursday, July 2, 2026
HomeTelanganaకుష్ఠువ్యాధిపై అపోహలు సున్నా స్థాయికి చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు

కుష్ఠువ్యాధిపై అపోహలు సున్నా స్థాయికి చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిధి రోలిసింగ్

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: 2030 నాటికి కుష్ఠువ్యాధిపై గల అపోహలు, మూఢనమ్మకాలను సున్నా స్థాయికి చేరే విధంగా దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిధి రోలిసింగ్ అన్నారు. బుధవారం డి.డి.జి. డా॥ సుదర్శన్ మండల్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుష్టు ప్రభావిత రాష్ట్రాలలోని జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిధి మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం కార్యక్రమంలో భాగంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడం, సరైన సమయంలో మందులు అందజేయడం, అవగాహన కల్పించడం కొరకు చర్యలు తీసుకోవాలని, 2030 నాటికి వ్యాధిపై ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను పూర్తిగా తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య సిబ్బంది వ్యాధిగ్రస్తులను గుర్తించాలని, జిల్లాల్లో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అంగవైకల్యం చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టి, వ్యాధి గురించి అవగాహన కల్పించి వారికి ఉపయోగపడే రబ్బరు చెప్పులు, వస్తువులను అందించాలని, జిల్లా వైద్యం అధికారులు, సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు. అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కుష్ఠువ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రె అనే బ్యాక్టీరియా వచ్చే అతి సామాన్యమైన వ్యాధి అని, చర్మానికి, నరాలకు సోకుతుందని, చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాల బహిర్గతం కావడానికి సగటున 3 నుండి 5 సం||ల వరకు సమయం పడుతుందని తెలిపారు. ఈ వ్యాధి ఎవరైనా రావచ్చని, లింగబేధం లేదని, వంశ పారంపర్యం కాదని, ఈ వ్యాధి ఎం.డి.టి. (బహుళ ఔషధ చికిత్స)తో 6 నుండి 12 నెలల్లో పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కుష్ఠు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ / ఎరుపు / రాగి రంగు కలిగి ఉంటాయని, మచ్చలపై స్పర్శ, నొప్పి ఉండదని, శరీరంలో ఏ ప్రదేశంలోనైనా రావచ్చని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే ఆరోగ్య కార్యకర్తను కాని, ఆరోగ్య కేంద్రాలలో వైద్యులను కాని సంప్రదించాలని, చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాల్లో ప్రతి 10 వేల జనాభాకు ఒక కుష్ఠువ్యాధి కేసు కంటే ఎక్కువ ఉన్నందున నిర్మూలనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ.

జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం కొనసాగుతుందని, ఇందులో భాగంగా డిసెంబర్ 6 నుండి 22వ తేదీ వరకు 667 ఆశా బృందాలు ఇంటింటికి వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నారని. తెలిపారు. ఇంత వరకు 496 మందిని అనుమానితులుగా గుర్తించగా 235 మందిని స్క్రీన్ చేయగా 9 మందిని కుష్ఠు వ్యాధిగ్రస్తులుగా నిర్ధారించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, పారామెడికల్ అధికారులు ఎ. శివకుమార్, జి. మొగిలిన, కె.సి. రాఘవయ్య, కె.ప్రభాకర్, కె.రమేష్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.