ప్రధాని నరేంద్రమోదీపై ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ చేస్తున్న కేటాయింపులపై స్పందిస్తూ. మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదంటూ ఎద్దేవా చేశారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ చేస్తున్న కేటాయింపులపై తరుచూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న కేటీఆర్. తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదంటూ ఎద్దేవా చేశారు. “వైద్య, ఆర్థిక, శాంతి, భౌతిక శాస్త్ర రంగాల్లో నోబెల్ బహుమతికి మోదీ ఎందుకని అర్హుడు కారాదు? కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో వైద్యరంగంలో మోదీకి నోబెల్ ఇవ్వకూడదా? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకు నుంచి మనీ రిటర్న్స్ కు గానూ ఆర్థిక శాస్త్రంలోనూ నోబెల్ పురుస్కారం ఇవ్వొచ్చు. అలాగే 6 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు శాంతి బహుమతి ఇవ్వాలి. రాడార్ సిద్ధాంతానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి మోదీ అర్హుడు” అని ట్విటర్ వేదికగా కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు.

