Tuesday, August 18, 2026
HomeTelanganaయాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విమెన్ సేఫ్టీ వింగ్ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల టాస్క్ ఇన్స్పెక్టర్ సీఐ అశోక్, ఎస్ఐ లచ్చన్న ల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కళాశాలలో బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా హరాస్మెంట్, పొక్సో యాక్ట్, సైబర్ క్రైమ్స్, గృహ హింస, మాదక ద్రవ్యాల వినియోగం మరియు తదితర అంశాలపై  సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాలోని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థుల కు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ అశోక్ మాట్లాడుతూ. ముఖ్యంగా మహిళలపై చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని యుక్తవయసులో ఉన్న తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను తల్లీదండ్రులు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. బాల్యవివాహలకు ప్రోత్సహించే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు మాదకద్రవ్యాల బారిన పడకుండా మంచిగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. పోలీసు శాఖ తరపునే కాకుండా ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా ఇకపై నిత్యం ఇలాంటి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఆపదలో ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్స్ 108,100,1093,181 లకు ఫోన్ చేసి పోలీసు మరియు ఇతర శాఖల యంత్రాంగం యొక్క సేవలు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా మహిళలపై, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.