Monday, August 17, 2026
HomeTelanganaకలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.?

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా టీడబ్ల్యుజేఎఫ్ జాతీయ సభ్యులు సురేందర్ మాట్లాడారు. టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ బస్ రాయితీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలన్నారు. జర్నలిస్టులకు “జర్నలిస్టు బంధు” పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు యూనియన్ సభ్యులతో కలసి డిమాడ్స్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.