Wednesday, August 19, 2026
HomeTelanganaఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా.. కానీ..: కేటీఆర్

ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా.. కానీ..: కేటీఆర్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణకు మెడికల్ కళాశాలల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా కేటీఆర్ ప్రకటించారు. “ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేదు” అని కేటీఆర్ విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.