
రోప్’ (రిమూవల్ ఆప్ అబ్జెక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెప్ట్ కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమైన సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ‘రోప్’ (రిమూవల్ ఆప్ అబ్జెక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్క ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధించాలని నిర్ణయించారు. కొత్త నిబంధనలు అక్టోబరు 3 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధన పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
