Tuesday, August 18, 2026
HomeTelanganaతరగతులను వెంటనే ప్రారంభించాలి.?

తరగతులను వెంటనే ప్రారంభించాలి.?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్  బోధనా కళాశాల తరగతులను ప్రారంబించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ ను కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభం ఆవశ్యకతతో పాటు పలు విషయాలను చర్చించారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైతే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆయనకు వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకే కాకుండా మహారాష్ట్ర నుండి వచ్చే వారికి సైతం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే తరగతులు ప్రారంభించాలని విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 26న కళాశాల బోధన తరగతుల ప్రారంభ విషయమై రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి హరీష్ రావును కలువగా ఆయన సైతం దీని ప్రారంభ విషయమై తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.