Wednesday, August 19, 2026
HomeCrimeఆ నాయకులు వేదిస్తున్నారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

ఆ నాయకులు వేదిస్తున్నారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: తెరాస నాయకులు వేధిస్తున్నారంటూ.. ఓ మహిళ ఏకంగా పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో అక్కడి స్థానికులు గమనించి తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను లాగేసుకున్నారు..

ఆంజనేయులు న్యూస్ వెబ్సైట్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ అనే మహిళ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈ మద్యే తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టిఆర్ఎస్  నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నిచింది . అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్ ను లాగేశారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.