Wednesday, August 19, 2026
HomeTelanganaఎస్సై అశోక్ కుమార్ ఇకలేరు

ఎస్సై అశోక్ కుమార్ ఇకలేరు

📰 Generate e-Paper Clip

గత రెండు నెలలుగా అనారోగ్యం

 తెల్లవారుజామున మృతిచెందిన ఎస్సై అశోక్ కుమార్

షాద్ నగర్ నియోజక వర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ హోదాల్లో పని చేసిన ఎస్సై అశోక్ కుమార్(61) ఆదివారం ఉదయం తుది శ్వాస వదిలారు. గత రెండు నెలల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అశోక్ కుమార్ స్థానిక హజీపల్లి రోడ్డులోని శ్రీనివాస కాలనీలో గల తన ఇంట్లోనే పరమపదించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి ఎస్సైగా ఎదిగి ఎక్కువ కాలం షాద్ నగర్ ప్రాంతంలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందుర్గు, కేశంపేట, దేవరకద్ర, గోపాలపేట ఇలా పలు ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ చేసినా… ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం తిరిగి ట్రాన్స్కో విజిలెన్స్ శాఖలో సేవలను తీసుకుంటున్నది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సేవా భావం పరోపకారం కలిగి మంచి వ్యక్తిత్వం ఉన్న అశోక్ కుమార్ మరణం అందరిని బాధిస్తున్నది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని పలువురు కోరుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.