Tuesday, August 18, 2026
HomeTelanganaదేవేంద్రసింగ్, మహేశ్ భగవత్ కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

దేవేంద్రసింగ్, మహేశ్ భగవత్ కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న దేవేంద్ర సింగ్ లకు రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. వీరితో పాటు మరో 12 మందికి ఇండియన్ పోలీసు మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది..

హైదరాబాద్ కమిషనరేట్ లో నేరవిభాగం, సిట్లకు అదనపు సీపీగా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ప్రస్తుతం మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీగా ఉన్న సాయిని శ్రీనివాసరెడ్డి, అనిశా ఖమ్మం రేంజ్ డీఎస్పీ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ వాసుదేవరెడ్డి, తెలంగాణ పోలీసు అకాడమీలో డీఎస్పీగా పనిచేస్తున్న గురు రాఘవేంద్ర, రామగుండం ఎస్బీ ఎస్ఐ రాజమౌళి, రాచకొండ కమిషనరేట్ చౌటుప్పల్ స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాసులు, కామారెడ్డి హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ ఏఎస్సై నీలం రెడ్డి, వరంగల్ టీఎస్ఎస్పీ ఫోర్త్ బెటాలియన్ లో ఏఆర్ ఏఎస్సై సాలేంద్ర సుధాకర్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ కు ఉత్తమ సేవలకు గాను ఇండియన్ పోలీస్ మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. పతకాలు పొందిన పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.