
వరద నీరు ఉదృతంగా ఉన్న ప్రాంతాలను సందర్శించి అధికారులకు సూచనలు చేసిన
రామగుండం సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
మంచిర్యాల, పెద్దపల్లి: జిల్లాలను కలుపుతూ ఉన్న గోదావరి బ్రిడ్జ్ గోదావరి వరద నీరు తో ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు తో చుట్టూ ప్రక్కల 2 కిలోమీటర్లు మేరకు నీరు రావడం తో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, అధికారులతో కలిసి గోదావరిఖని గంగ నగర్ మరియు ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి వాహనాలు ను అనుమతించ కూడదని, బ్రిడ్జ్ కు ఇరువైపుల నుండి వరద నీరు ప్రవహిస్తుంది కావున వాహనాలు దారి మళ్ళించాలని, అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ అప్రమత్తం గా వ్యవహారించాలని సూచించారు.
ఏసీపీ గిరి ప్రసాద్, గోదావరిఖని1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణ, జైపూర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు..
