Monday, August 17, 2026
HomeTelanganaప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం చేయాలి

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో 3న హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ పోస్టర్ ను శనివారం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కావిందర్ గుప్తా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే నిజమైన తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలు కూడా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు మున్నరాజ సిసోడియా, మునిమంద రమేష్, కోయ్యాల ఏమాజి. పుల్గం తిరుపతి, రాజులాల్ యాదవ్, కోయల్కర్ గోవర్ధన్, భీమన్న, రామయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.