
కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కుమారుడు, కోడలిపై వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమను ఇంటి నుంచి తరిమేసి వేధిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్.. ఇంటిని ఖాళీ చేయించి వృద్ధులకు అప్పజెప్పాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధులతో సహా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంటికి చేరుకున్నారు. ఈ లోపే కుమారుడు, కోడలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఇంటి ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు.

