
ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి: దుంపల రంజిత్ కుమార్.
కాలం చెల్లిన బస్సులు నడుస్తున్న పట్టించుకోని అర్టీఎ అధికారులు.
డ్రైవర్ కి బదులు బస్సు నడిపిన క్లినర్…
గాయలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.
మంచిర్యాల జిల్లా: పాఠశాల బస్సు బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… కన్నెపల్లి మండల కేంద్రంలోని ప్రజ్ఞ మోడల్ స్కూల్ అను ప్రైవేట్ పాఠశాల బస్సు నిన్నటి రోజున విద్యార్థులను పాఠశాల నుండి ఇంటికి తరలిస్తున్న సమయంలో బస్సు ను డ్రైవర్ కి బదులుగా క్లినర్ నడపడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంత మంది బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ఇంకొంత మందిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒక విద్యార్థి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలు ఇష్టనుసారంగా వ్యవరించడం మరియు ఆర్టిఏ అధికారుల పర్యవేక్షణ లోపంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.వెంటనే ఆర్టిఏ అధికారులు స్పందించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కాలం చెల్లిన బస్సులను సీజ్ చేయాలి…
అదే విధంగా ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తూ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న విద్యార్థి వైద్య ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీఐటీయు ఆసుపత్రి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

