Thursday, August 20, 2026
HomeCrimeఛార్జింగ్ లో పేలిన ఎలక్ట్రిక్ వాహనం..!

ఛార్జింగ్ లో పేలిన ఎలక్ట్రిక్ వాహనం..!

📰 Generate e-Paper Clip

దగ్ధమైన ద్విచక్ర వాహనం, ఇల్లు

సిద్దిపేట జిల్లా: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పుట్ట లక్ష్మీనారాయణ బీడీ కార్ఖానా నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలుచేశారు. ఇటీవల కుమారుడి వివాహమైంది. ఎదురిల్లు ఖాళీగా ఉండటంతో హైదరాబాద్ లో ఉంటున్న యజమాని దుర్గయ్యను సంప్రదించి కొంత సామగ్రిని ఆ ఇంట్లో సర్దిపెట్టుకున్నారు. మంగళవారం పొద్దుపోయాక లక్ష్మీనారాయణ వాహనాన్ని దుర్గయ్య ఇంటిముందు నిలిపి ఛార్జింగ్ పెట్టి తన ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటలకు పేలుడు శబ్దం వినపడటంతో బయటకు పరుగులుతీశారు. వాహనం కాలిపోతుండటాన్ని గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు..

క్షణాల్లో మంటలు ఇంటిని చుట్టుముట్టాయని, వాహనంతోపాటు ఇంట్లో భద్రపరిచిన తునికాకు సంచులు, ఇతర వస్తువులు కాలిపోయాయని’ బాధితుడు వాపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.